పసుపు విత్తనం @ కనకాపూర్‌ | - | Sakshi
Sakshi News home page

పసుపు విత్తనం @ కనకాపూర్‌

Jul 2 2026 2:59 AM | Updated on Jul 2 2026 2:59 AM

● కొనుగోలుకు రైతుల ఆసక్తి ● ఏటా పెరుగుతున్న డిమాండ్‌

లక్ష్మణచాంద: జిల్లాలో పసుపు విత్తనానికి కేరాఫ్‌గా మండలంలోని కనకాపూర్‌ నిలుస్తోంది. గ్రామానికి చెందిన రైతులు నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌, అంక్సాపూర్‌ గ్రామాలకు వెళ్లి అక్కడ పసుపు వి త్తనాన్ని కడాయి చొప్పున కొనుగోలు చేసి ఇక్కడికి తరలిస్తారు. నిర్మల్‌ నుంచి మంచిర్యాలకు వెళ్లే జాతీ య రహదారి 61పై కనకాపూర్‌ వద్ద విక్రయిస్తున్నా రు. ఏటా ఖరీఫ్‌ ప్రారంభం కాగానే ఇక్కడ లభించే పసుపు విత్తనాన్ని కొనుగోలు చేయడానికి జిల్లాలో ని లక్ష్మణచాంద, మామడ, సోన్‌, దిలావర్‌పూర్‌, సారంగపూర్‌ తదితర మండలాల నుంచి రైతులు వస్తున్నారు. పసుపు విత్తనం ప్రారంభంలో రూ.6వేలు ఉండగా మంగళవారం కడాయికి రూ.7,500 ధర ఉంది. సీజన్‌లో 200 నుంచి వెయ్యి కడాయిల పసుపు విత్తనం అమ్ముడు పోతుందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు సుమారు 7–8 కడాయిల పసుపు విత్తనం పండుతుందని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement