సారంగపూర్: మండలంలోని స్వర్ణ గ్రామంలో ప్ర కృతి విపత్తులు తలెత్తిన సమయంలో తీసుకోవాల్సి న జాగ్రత్తలపై శిక్షణ డెప్యూటీ కలెక్టర్ ఎల్లందుల రా కేశ్‌కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ప్రకృతి విపత్తు ల నిర్వహణ సంస్థ అధికారి రాజేశ్ ప్రజలకు అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో తీవ్ర వర్షాభావ ప రిస్థితులు నెలకొన్న సమయంలో లోతట్టు ప్రాంతా ల్లో నివసిస్తున్న ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి వివరించారు. అగ్ని ప్ర మాదాలు, వేడిగాలులు, పాముకాట్లు, ఇతర అవసరాలు వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందించాలన్న అంశాల గురించి అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, 104, 108, 102 లాంటి టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా అందించే సహాయ సహకారాల గురించి వివరించారు. స్థానిక సర్పంచ్ మల్లయ్య, జీపీవో రమేశ్, గ్రామస్తులున్నారు.


