ఖానాపూర్: ఖానాపూర్ నియోజకవర్గంలో హ్యామ్ పథకం కింద మంజూరైన బీటీ రోడ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఇతర రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి పనులూ చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉట్నూర్, ఖానాపూర్, ఇంద్రవెల్లి, కడెం, పెంబి, జన్నారం మండలాల్లో హ్యామ్ పథకం కింద బీటీ రోడ్లు మంజూరు కావడంపై హర్షం వ్యక్తంజేశారు. అలాగే, పెంబి–అల్లంపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు కలెక్టర్‌తో కలిసి పర్యటించిన సందర్భంగా గుర్తించిన రహదారులు, మౌలిక వసతుల సమస్యలను కూడా పరిష్కరించాలని మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే బొజ్జు ఈ సందర్భంగా తెలిపారు.


