గుప్తనిధుల కలకలం! | - | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కలకలం!

Jun 30 2026 11:52 PM | Updated on Jun 30 2026 11:52 PM

తాండూర్‌: తాండూర్‌ గ్రామ శివారులో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. తాండూర్‌ పాత గెస్ట్‌హౌజ్‌ వెనకాల ఉన్న ఓ వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీతో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లను మంగళవారం తెల్లవారుజామున పలువురు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు గుంత తవ్విన ప్రాంతంలో అమ్మవారి విగ్రహానికి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. ఈ తవ్వకాలు గుప్త నిధుల కోసం చేశారా? లేక ఏదైనా క్షుద్ర పూజలు చేయించారా..? అనేది తెలియడం లేదు. తాండూర్‌, భీమిని రహదారికి కొద్ది దూరంలోనే ఈ తవ్వకాలు జరపడం మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. విషయం తెలిసిన స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement