ఆటో ఢీకొని ఒకరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని ఒకరికి గాయాలు

Jun 30 2026 11:52 PM | Updated on Jun 30 2026 11:52 PM

ఖానాపూర్‌: మండలంలోని దిలావర్పూర్‌ గ్రామంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కడెం మండలం మద్దిపాడగ గ్రామానికి చెందిన ఆకుల అనిల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement