సరస్వతి ఆలయ ఆస్థాన వైణికుడిగా బాలుడు ప్రతీ శుక్రవారం నాదార్చన చేసే అరుదైన అవకాశం పిన్న వయస్సుల్లోనే గొప్ప వరం
జాతీయ కళా ఉత్సవ్ 2025లో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రథమ బహుమతి సాధించి, పుణేలో జరిగిన జాతీయస్థాయి ఫైనల్స్‌లో తెలంగాణ తరపున సత్తా చాటాడు.
ఈ ఏడాది రిపబ్లిక్ డే ఎట్ హోమ్ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా ప్రశంసా పురస్కారం అందుకున్నాడు.
ఫిబ్రవరి 15, 2026న ఆల్ ఇండియా రేడియో, నిజామాబాద్ ఎఫ్‌ఎంలో వజ్రాంశు సోలో వీణ ప్రదర్శన ప్రసారమైంది.
భైంసా: నేటి తరం పిల్లల చేతులు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లకే అతుక్కుపోతుంటే 14 ఏళ్ల బాలుడి వేళ్లు మాత్రం వీణతంత్రులతో దివ్య స్వరాలు పలికిస్తున్నాయి. ఆధునిక సంగీత హోరులోనూ ప్రాచీన సాంస్కృతిక వారసత్వాన్ని గుండెలకు హత్తుకొని, చారిత్రాత్మక బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో అతి పిన్న వయస్కుడైన ‘ఆస్థాన వైణికుడు’గా నిలిచాడు బొల్లి వజ్రాంశు.
అరుదైన భాగ్యం..
సకల కళలకు ఆదిదేవత బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఒక్క రోజైనా ప్రదర్శన ఇచ్చే అవకాశం వస్తే చాలని దేశంలోని ఎందరో దిగ్గజ కళాకారులు కోరుకుంటారు. అటువంటి పవిత్ర క్షేత్రంలో ఇప్పటివరకు ఆలయ చరిత్రలో మరే ఇతర పెద్ద విధ్వాంసుడికి కూడా దక్కని మహాభాగ్యం వజ్రాంశుకు దక్కింది. కేవలం ఒక్కరోజు వేదికను పంచుకోవడమే పరమావధిగా భావించే కళాలోకంలో.. ప్రతీ శుక్రవారం అమ్మవారి అత్యంత పవిత్రమైన దేవీ చతుష్షష్టి ఉపచార పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన నాద అర్చన చేసే అరుదైన అవకాశాన్ని ఆలయ యంత్రాంగం బాలుడికి కల్పించింది.
దైవానుగ్రహం..
వజ్రాంశు కుటుంబంలో ఎవరికీ సంగీత నేపథ్యం లేదు. తండ్రి డాక్టర్ బి. బాలకృష్ణ బాసర ఆర్‌జీయూకేటీలో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టడంతో వీరి కుటుంబం హైదరాబాద్ నుంచి బాసరకు మారింది. తల్లి కస్తూరి వజ్రాంశులోని ప్రతిభను గుర్తించగా.. ప్రముఖ వీణా విధ్వాంసులు మల్లెల వెంకటరమణ గోవింద మూర్తి వజ్రంలా తీర్చిదిద్దారు.
విజయాల ప్రయాణం


