బాసర: జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో 80 మంది వీణా వాయిద్యకారులు మంగళవారం సామూహిక వీణానాదం ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీణా వాయిద్యకారులు ఒకే వేదికపై వీణానాదాలతో అమ్మవారికి సంగీత సేవ సమర్పించారు. ప్రశాంతి, ఉమాదేవి మార్గదర్శకత్వంలో నిర్వహించిన కార్యక్రమాన్ని నాగలక్ష్మి సమన్వయం చేశారు. వీణా నాదానికి నరసింహ వర్మ త బల, గంగాధర్ గౌడ్ కీబోర్డ్ సంగీత సహకారం అందించారు. శ్రీమతి ధనలక్ష్మి, శ్రీమతి అరుంధతి గానం చేసి కార్యక్రమానికి మరింత ఆధ్యాత్మిక శోభ తీసుకొచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనాదేవి పాల్గొన్నారు.
శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం కూల్చివేత
తానూరు: మండలంలోని వడ్‌ఝరి(భి) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారింది. దీంతో అధికారుల సమక్షంలో మంగళవారం భవనాన్ని జేసీబీతో కూల్చివేశారు. కొన్నేళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. దీంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నత అధికారుల అనుమతితో ఎంఈవో నరేందర్ సమక్షంలో కూల్చివేశారు.
జేసీబీతో భవనం కూల్చివేస్తున్న అధికారులు


