దస్తురాబాద్: మండలంలోని గోడీసీర్యాల గ్రామంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో భారీ నష్టం సంభవించింది. సోమవారం రాత్రి కురిసిన వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి లోటెన్షన్ లైన్లపై పడటంతో గ్రామంలోని 46 ఇళ్లలో విద్యుత్ పరికరాలు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని విద్యుత్ మీటర్లతో పాటు టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాలు కాలిపోయాయి. గ్రామంలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో ఉండడం, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సరిగా లేకపోవడంతో తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపించారు.
కేజీబీవీలో నో అడ్మిషన్స్
కుంటాల: మండలంలోని కల్లూరు కేజీబీవీలో అడ్మిషన్లు నిండటంతో సిబ్బంది పాఠశాల గేటుకు నో అడ్మిషన్స్ బోర్డు తగిలించారు. పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు గానూ 240 మంది ఉన్నారని.. ఈసారి ప్రారంభించిన జూనియర్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ గ్రూపులో 20 మంది విద్యార్థినులు చేరినట్లు ఎస్‌ఓ సువర్ణ తెలిపారు.


