న్యూస్‌రీల్
8లోu
అమ్మవారి చెంత ‘వజ్రం’శు
నేటి తరం పిల్లల చేతులు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లకే అతుక్కుపోతుంటే 14 ఏళ్ల బాలుడి వేళ్లు మాత్రం వీణతంత్రులతో దివ్య స్వరాలు పలికిస్తున్నాయి. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ‘ఆస్థాన వైణికుడు’గా నిలిచాడు బొల్లి వజ్రాంశు.
పట్టెడు అన్నం
పెట్టించండి సారూ..
లోకేశ్వరం: ‘సార్ మాది వట్టోలి గ్రామం. నాకు ఇద్దరు కొడుకులు.. రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి గెంటేసిండ్రు. అన్నం పెడ్తలేరు’ అని ఓ వృద్ధ మహిళ కలెక్టర్‌కు తన గోడు వెల్లబోసుకుంది. వట్టోలి గ్రామానికి చెందిన జంగం గంగవ్వ మంగళవారం మండల కేంద్రానికి వచ్చిన కలెక్టర్ భవేశ్‌మిశ్రాను కలిసింది. తన ఇద్దరు కుమారులపై ఫిర్యాదు చేసింది. తనకు ఉన్న ఎకరం నర భూమిని ఇద్దరు కొడుకులు శంకరప్ప, శేషప్ప, కూతురు రేఖ అర ఎకరం చొప్పున పంట్టా చేయించానని తెలిపింది. భూమి తీసుకున్న కొడుకులు తనను ఇంట్లో నుంచి గెంటేశారని, అన్నం కూడా పెట్టడం లేదని కన్నీటిపర్యంతమైంది. స్పందించిన కలెక్టర్ గంగవ్వకు న్యాయం చేయాలని ఆర్డీవోను ఆదేశించారు.
నిర్మల్‌ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రీ–ప్రైమరీ పాఠశాలలకు జిల్లాలో మంచి ఆదరణ లభిస్తోంది. గత విద్యా సంవత్సరంలో ప్రారంభమైన 14 చిన్న బడులతోపాటు, ఈ ఏడాది మరో 74 బడులు ఏర్పాటు చేశారు. మొత్తం 88 ప్రభుత్వ ప్రీ–ప్రైమరీ బడులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా విద్యాశాఖ గణాంకాల ప్రకారం, ఈ 88 చిన్న బడుల్లో ఇప్పటి వరకు 856 మంది చిన్నారులు చేరారు. కొత్తగా మంజూరైన 74 బడుల్లో 727 మంది, గతేడాది ప్రారంభించిన 13 ప్రీ–ప్రైమరీ పాఠశాలల్లో 108 మంది, ఒక పీఎంశ్రీ పాఠశాల ప్రీ–ప్రైమరీలో 21 మంది చిన్నారులు ప్రవేశాలు పొందారు.
ప్రాథమిక విద్యకు బలమైన పునాది..
మూడు నుంచి ఐదేళ్లలోపు వయసు ఉన్న చిన్నారులకు ఆటలు, పాటలు, కథలు, సృజనాత్మక కార్యకలాపాల ద్వారా నేర్చుకునే అవకాశాన్ని ఈ తరగతులు కల్పిస్తున్నాయి. చిన్న వయసులోనే ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన పిల్లలు తర్వాత కూడా అదే పాఠశాలలో ప్రాథమిక విద్యను కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు.
అవగాహన, పర్యవేక్షణ..
అడ్మిషన్లను పెంచేందుకు ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత విద్య, పుస్తకాలు, యూని ఫాం, మధ్యాహ్న భోజనం వంటి ప్రభుత్వ సౌకర్యాలను వివరించి ప్రవేశాలకు ప్రోత్సహిస్తున్నారు. మండల, జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేకంగా ప ర్యవేక్షణ చేపట్టి అడ్మిషన్ ప్రక్రియను వేగవంతం చే స్తున్నారు. ప్రతీ పాఠశాలకు ఒక ఇన్‌స్ట్రక్టర్, ఒక ఆ యాను నియమించి విధుల్లోకి తీసుకున్నారు. చిన్నా రుల వయసు, నేర్చుకునే సామర్థ్యానికి అనుగుణంగా ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రవేశాలు పెరిగే అవకాశం..
ప్రస్తుతం కొనసాగుతున్న అడ్మిషన్ల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింతమంది చిన్నారులు ప్రభుత్వ చిన్న బడుల్లో చేరే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభ దశలోనే 856 మంది చేరడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతున్నట్లు సూచిస్తోంది.


