భైంసాటౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని స బ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ అన్నారు. ఆస్పత్రి ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలపై ఆ రా తీశారు. వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు, ఆస్పత్రిలో వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్, ఫార్మసీ పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో పారిశుధ్య మెరుగుపర్చాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలిస్తున్న
సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్


