ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ మారెమ్మ తల్లి దేవాలయంలోని వేపచెట్టు కాండంను కళాకారుడు అశోక్ అమ్మవారి రూపం వచ్చేలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. సోమవారం మారెమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేపచెట్టులో అమ్మవారి ప్రతిరూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ప్రత్యేక పూజలు, నైవేద్యాలతో ఆలయం భక్తజన సందోహంతో కళకళలాడింది. కళాకారుని నైపుణ్యాన్ని చూసి భక్తులు ప్రశంసల జల్లు కురిపించారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్


