నార్నూర్: మండల కేంద్రానికి చెందిన చౌహాన్ తిమ్మన్న–నీలాబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. తిమ్మన్న మేసీ్త్ర పని చేసి ఇద్దరు కుమారులను చదివించాడు. చిన్న కుమారుడు కుశాల్ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం కొనసాగించాడు. అగ్నివీర్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల కష్టం, వారి ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలోనే తాను ఉద్యోగం సాధించానని కుశాల్ తెలిపాడు.


