లక్ష్మణచాంద:మండల కేంద్రానికి చెంది నీరటి నర్సయ్య సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తన భార్య దివ్యతో కలిసి లక్ష్మణచాంద నుంచి నిర్మల్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో మండలంలోని కనకాపూర్ రహదారిపై పెద్దపల్లి జిల్లా నుంచి కనకాపూర్‌కు ఏషియన్ పెయింట్స్ మెటీరియల్ తీసుకెళ్తున్న వాహనం డ్రైవర్ ఆకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు. ఈ క్రమంలో నర్సయ్య బైక్ దానిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సయ్యకు కుడి కాలు విరుగగా, దివ్యకు స్వల్వ గాయాలయ్యాయి. వీరిని 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దివ్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.


