సినిమాలు చూసి.. స్ఫూర్తి పొంది.. | - | Sakshi
Sakshi News home page

సినిమాలు చూసి.. స్ఫూర్తి పొంది..

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

ఆదిలాబాద్‌: సినిమాలు చూసి స్ఫూర్తి పొంది ఉద్యోగం సాధించాడు ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం దిమ్మ గ్రామానికి చెందిన ఈర్నాల సాయి–కళ దంపతుల కుమారుడు నవదీప్‌. నవదీప్‌. మేజర్‌, షేర్షా సినిమాలను చూసి స్ఫూర్తి పొందాడు. సైనికుల తెగువ, వారి ధైర్యం, త్యాగాలను ఆదర్శంగా తీసుకుని నిత్యం శ్రమించాడు. ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల నేవీలో ఎంఆర్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులతో ప్రతిభ కనబరిచాడు. సినిమాలు చూసి పెడదారి పట్టకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలిచాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement