చెన్నూర్: చెన్నూర్ ఆగస్త్య గుండం ఆధ్యాత్మిక, ప ర్యాటక కేంద్రానికి సందర్శకుల తాకిడి పెరిగింది. రోజు రోజుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వా రి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి సందర్శించి శివలింగంను అభివృద్ధి చేసి ట్యాంక్‌బండ్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ చ్చే గోదావరి పుష్కారాల్లో సందర్శకుల సంఖ్య మ రింత పెరిగే అవకాశం ఉంది. పెద్ద చెరువు మధ్యలో ఉన్న ఆగస్త్యగుండం, శివలింగం దర్శనానికి వచ్చే భక్తులు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంతో సేదదీరుతున్నారు. ఆగస్త్యగుండం అందాల ఫొ టోలు తీస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. గుండం చు ట్టూ పూర్తిగా ప్రహరీ లేకపోవడంతో ప్రమాదం పొ ంచి ఉంది. పూర్తి స్థాయిలో ప్రహరీ నిర్మించి భక్తుల రక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.


