బాసర:ఆర్జీయూకేటీ బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లలో యూజీ ప్రవేశాలకు నాలుగో విడత 69 సీట్ల భర్తీకి జూలై 3న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్‌ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ కౌన్సెలింగ్ జూలై 2న, ఎన్‌సీసీ కేటగిరీ కౌన్సెలింగ్ జూలై 4న ఉంటుందని వివరించారు. అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నిర్ణీత తేదీల్లో హాజరు కావాలని సూచించారు.
బాసరలో 928 అక్షరాభ్యాసాలు
బాసర:జూలై 5 నుంచి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు బాలాలయంలో దర్శనమివ్వనున్న నేపథ్యంలో వారం రోజలుగా క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. జేష్ట పౌర్ణమి సందర్భంగా సోమవారం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 928 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. హుండీ, సేవల ద్వారా రూ.9,62,050 ఆదాయం సమకూరినట్లు ఈవో అంజనాదేవి తెలిపారు.
బాలికను మోసగించిన యువకుడి అరెస్టు
భీమారం: బాలికను మోసగించిన కేసులో మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన సిధార్థను అరెస్టు చేసినట్లు జైపూర్ సీఐ నవీన్ తెలిపారు. గత రెండేళ్లుగా బాలికను ప్రేమించి వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం చెన్నూర్ కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.


