ఖానాపూర్: ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా బుకింగ్ కోసం రైతులు విని యోగిస్తున్న ఫర్టిలైజర్ యాప్ సోమవారం సాంకేతిక సమస్యల కారణంగా సరిగా పనిచేయలేదు. దీంతో యూరియా బుకింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. యాప్‌లో లాగిన్ సమస్యలతోపాటు బుకింగ్ పూర్తి కాకపోవడంతో పలువురు రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి యూరియా బుకింగ్ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఖానాపూర్ మండల వ్యవసాయ అధికారి జగదీశ్వర్ స్పందిస్తూ, ఫర్టిలైజర్ యాప్‌కు కొత్త వెర్షన్ (1.0.11) అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. రైతులు తమ మొబైల్‌లో ఉన్న పాత వెర్షన్‌ను తొలగించి, తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.


