భైంసాటౌన్: పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాంపెల్లి నాగభూషణ్ కుమారుడు అక్షయ్‌కుమార్ దంత వైద్యుడిగా పనిచేస్తున్నాడు. వెయ్యికిపైగా దంత ఆరోగ్య శిబిరాలు, లక్ష వరకు ఉచిత దంత ఆరోగ్య కన్సల్టేషన్ నిర్వహించాడు. దీంతో దంత వైద్య రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తించిన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆయన్ను స్మైల్ వర్స్ అవార్డుతో సత్కరించింది. మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం నిర్వహించిన నేషనల్ వైడ్ స్మైల్ వర్స్ అవార్డు 2026 కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఇంపాక్ట్ విభాగంలో అక్షయ్‌కుమార్‌ను అవార్డుతో సత్కరించారు.


