న్యూస్‌రీల్
7
నిర్మల్
మర్రి చెట్టుకు హారతి ఇస్తున్న మహిళలు పూజారి
గడువులోగా ఎన్యూమరేషన్ ఫాంలు పంపిణీ చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: ఎస్‌ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఎన్యూమరేషన్ ఫాంల పంపిణీ గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫాంల వివరాలు తెలుసుకున్నారు. బూత్ లెవెల్ అధికారులు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఫాంలు అందివ్వాలన్నారు. బీఎల్‌వోలు మాత్రమే ఫాంలు పంపిణీ చేయాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు ఉన్న సందేహాలు నివృత్తి చేయడానికి ’హెల్ప్ డెస్క్’ లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనతరం కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులతో మాట్లాడారు. ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, ఆర్డీవో దేవీదాస్, అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్: ‘మేము అధికారంలో ఉన్నామా.. లేక ప్రతిపక్షంలో ఉన్నామా..? జిల్లాలో ఉన్న తమను సంప్రదించకుండా ప్రతిపక్ష నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి..? ఈ తీరుతో పార్టీ కోసం పనిచేసే క్యాడర్‌కు ఏం సందేశం ఇస్తున్నట్లు..?’ అంటూ కాంగ్రెస్ పార్టీ బడానేతలు సొంత ప్రభుత్వంపై అసంతృప్త గళం వినిపిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం పెరుగుతోంది. పార్టీ సమావేశాలే వేదికగా ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తుండటం సంచలనంగా మారుతోంది. ఇటీవల ఆదిలాబాద్, నిర్మల్‌లో
జరిగిన పార్టీ సమావేశాల్లో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్, మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు అసహనం వ్యక్తం చేయడం జిల్లా కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది.
అధికారమా.. ప్రతిపక్షమా..!?
‘రాష్ట్రంలో మన పార్టీ అధికారంలో ఉంది. జిల్లాలో మన ఎమ్మెల్యే సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీల్లోనూ గణనీయంగా స్థానాలను గెలుచుకున్నాం. నిత్యం పార్టీ కోసం పనిచేసే క్యాడర్ ఉంది. ఇవన్నీ కాదని, మనల్ని లెక్కలోకి తీసుకోకుండా.. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు మన ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి..!?’ అంటూ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆదిలాబాద్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్, నిర్మల్‌లో ఆదివారం సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు అడిగారు. తమను సంప్రదించకుండా ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలకు పనులు చేయడం, అభివృద్ధి పనులు సమాచారం ఇవ్వడం ఏంటంటూ ఇన్‌చార్జి మంత్రి జూపల్లిని ప్రశ్నించారు.
నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు
వాళ్లకు ప్రాధాన్యత ఎందుకు..?
ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నిర్మల్, ఆదిలాబాద్ పర్యటనల్లో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్‌రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం హస్తం క్యాడర్‌కు నచ్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో, వేదికలపైనా వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ నేతలు, క్యాడర్ అసహనం వ్యక్తంచేస్తున్నారు. తమ పార్టీకి పనికిరాని ప్రతిపక్షాల పనులు చేయడం, వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. లోకల్‌గా ఉండే సొంతపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే వారు పార్టీకి ఎలా పనిచేస్తారని నిలదీస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా అనే అయోమయం కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొందని నిర్మల్ సమావేశంలో కూచాడి శ్రీహరిరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనుల విషయంలోనూ ఎలాంటి సమాచారం ఉండటం లేదన్నారు. కార్యకర్తలు ఏదైనా పని చెబితే చేయించలేక, వారికి కారణం చెప్పలేక అవమానాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులను కాదని, ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సొంతపార్టీ ఎమ్మెల్యే, సీఎంకు దగ్గర అని పేరున్న నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జుపటేల్ సైతం మండిపడటం రాజకీయ చర్చకు దారితీసింది. ప్రతిపక్ష నేతలకు ప్రాధాన్యంపై సీఎల్పీ మీటింగ్‌లోనే తేలుస్తారా.. లేక సీఎం సమక్షంలోనే స్పష్టం చేస్తారా.. అని జూపల్లి ఎదుటే బొజ్జుపటేల్ అడగటం రెండు జిల్లాలో హస్తం పార్టీ నేతల అసహనం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది.
సీఎం దగ్గర
తేల్చాల్సిందే..!


