నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఎల్‌కేజీ, మరొకరు నాలుగో తరగతి చదువుతున్నారు. పుస్తకాలు పాఠశాలలోనే కొనాలని చెప్పారు. ఎల్‌కేజీకే రూ.3,195 పుస్తకాలు, రూ.500 నోట్‌బుక్స్‌కు తీసుకున్నారు. నాలుగో తరగతికి పుస్తకాలకు రూ.4,325, నోట్‌బుక్స్‌కు రూ.500 తీసుకున్నారు. వద్దని చెప్పినా బలవంతంగా అంటగడుతున్నారు.
– శ్రీకాంత్, భైంసా
పుస్తకాల పేరిట దోపిడీ..
ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల పేరిట ఇష్టారీతిన దోచుకుంటున్నారు. మార్కెట్‌లో దొరికే పుస్తకాల కంటే మూడురెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల విక్రయాన్ని విద్యాశాఖ అధికారులు అడ్డుకోవాలి. ఐఐటీ ఒలింపియాడ్ అంటూ పుస్తకాలు అంటగడుతున్నారు. పేద, మధ్య తరగతి తల్లిదండ్రులపై ఆర్థికంగా భారం మోపుతున్నారు. విద్యాశాఖ అధికారులు తనిఖీలు జరిపి చర్యలు తీసుకోవాలి.
– తోట రాము, భైంసా


