లక్ష్మణచాంద: హైకోర్టు ఆదేశాల మేరకు పీఏసీఎస్ లలో బుధవారం పాత పాలకవర్గాలు కొలువుదీరా యి. నిన్నటివరకు వీటికి నామినేటెడ్ పద్ధతిలో నూ తన పాలకవర్గాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో చాలామంది ఆశావహులు పదవుల కోసం ఎదురుచూశారు. గతంలో ప్ర భుత్వం సిట్టింగ్ పాలకవర్గాలను అర్ధంతరంగా తొ లగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పద్ధతిలో నూతన చైర్మన్లు వస్తారని ఆశిస్తున్న తరుణంలో పాత పాలకవర్గాలనే కొనసాగించాలంటూ హై కోర్టు ఆదేశాలిచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఓటింగ్ పద్ధతిలో పీఏసీఎస్ పాలకవర్గాలు ఏర్పాటయ్యా యి. 2025 ఫిబ్రవరి 13నాటికి పదవీకాలం ముగి యగా ప్రభుత్వం మరో ఆర్నెళ్లు పొడిగించింది. 2025 ఆగస్టు 14తో ఈ గడువు కూడా ముగియగా మళ్లీ వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 డిసెంబర్ 19న పాలకవర్గాలను ఆకస్మికంగా తొలగించింది. ఆ తర్వాత పీఏసీఎస్‌లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ జీవో 597ను విడుదల చే సింది. దీంతో పలువురు పీఏసీఎస్ చైర్మన్లు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. నూతన పాలకవర్గాలను ఎన్నుకునేదాకా తమనే కొనసాగించాలని కో రారు. దీంతో గత డిసెంబర్ 23న హైకోర్టు పాత పాలకవర్గాలను కొనసాగించాలని ఆదేశించినా ప్ర భుత్వం స్పందించలేదు. ఈసారి మళ్లీ వారు హైకో ర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కరణ కేసు వేయగా ప్ర భుత్వం దిగివచ్చింది. ఈ మేరకు జీవో 597ను ఉపసంహరించుకుంటూ పాత చైర్మన్లకు బాధ్యతలు అ ప్పగించాలని రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు వచ్చిన ట్లు జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో 77 సంఘాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 77 పీఏసీఎస్‌లుండగా వీటిలో నిర్మల్ జిల్లాలో 17, ఆదిలాబాద్‌లో 28, మంచిర్యాలలో 20, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 12 ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు బుధవారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్ ఇన్‌చార్జి చైర్మన్‌లుగా పాతవారే మళ్లీ బాధ్యతలు స్వీకరించారు.


