భైంసాటౌన్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా భైంసా పట్టణంలో నిర్వహిస్తు న్న పారిశుద్ధ్య పనులను ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్ట ర్ వెంకటేశ్వర్లు పరిశీ లించారు. కార్యక్రమ అమలు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ యన మాట్లాడుతూ.. 99రోజుల కార్యాచరణను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ప్రభు త్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాల ని, ప్రజలకు మెరుగైన సేవలందించాలని మున్సి పల్ కమిషనర్ నవీన్‌ను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, వైస్ చైర్మన్ బీబీ కుతిజా సిద్దిఖా, ఇద్రిస్ బేగ్ తదితరులున్నారు.
పేండ్‌పల్లి గ్రామంలో..
భైంసారూరల్: మండలంలోని పేండ్‌పల్లి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో శుభ్రత పనులు, చెత్త సేకరణ విధానం, కాలువల పరిశుభ్ర త తదితర అంశాలపై ఆరా తీశారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీడీవో ప్రదీప్‌కుమార్, సర్పంచ్ శ్రీనివాస్, కార్యదర్శి కవిత, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.


