నర్సాపూర్(జి): గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని జిల్లా పంచాయతీ అధికారి శ్రీని వాస్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్ర ణాళికలో భాగంగా ఆదివారం మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో 11మంది పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు. వారికి పారిశుద్ధ్య కిట్లు అందించి వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం ఇంద్రకరణ్‌రెడ్డి, ఉపసర్పంచ్ గాడి ప్రభాకర్, ఎంపీవో తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాథోడ్ కై లాస్, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


