విధుల్లేవ్‌.. విధానాల్లేవ్‌! | - | Sakshi
Sakshi News home page

విధుల్లేవ్‌.. విధానాల్లేవ్‌!

Mar 16 2026 7:27 AM | Updated on Mar 16 2026 7:27 AM

ఖాళీగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు శిక్షణ పూర్తి చేసుకుని నిరీక్షణ విడుదల కాని మార్గదర్శకాలు మూడు నెలలైనా పట్టింపేది?

నిర్మల్‌చైన్‌గేట్‌: సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు శాఖలో లైసెన్స్‌్‌డ్‌ సర్వేయర్ల విధుల విషయంలో స్పష్టత కరువైంది. శిక్షణ పూర్తి చేసుకుని దాదాపు మూడు నెలలైనా వీరికి కేటాయించే విధుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. దీంతో వీరు ఆయా మండలాల్లో ఖాళీగా ఉంటున్నారు. భూవి వాదాలు పెరుగుతుండడం.. సర్వేయర్ల కొరత ఉండడంతో ప్రభుత్వం వినూత్నంగా లైసెన్స్‌్‌డ్‌ సర్వేయర్ల విధానాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు టామ్‌ కాం ద్వారా మూడునెలల పాటు శిక్షణ ఇచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టూల్స్‌ ద్వారా భూములను సర్వే చేసే విధానంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మండలాలు కూడా కేటాయించారు. కానీ, వీరు ఎలాంటి విధులు నిర్వర్తించాలనే అంశంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. దీంతో ఆయా మండలాల్లో వీరు ఖాళీగా ఉంటున్నారు. నిత్యం మండల కార్యాలయానికి వచ్చి వెళ్తూ తమ విధులు, బాధ్యతల విషయంలో ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

డీజీపీఎస్‌పై శిక్షణ

లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ఆధునిక సాంకేతికతో కూడిన డీజీపీఎస్‌ (డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) విధానంపై కూడా శిక్షణ ఇచ్చారు. సంప్రదాయ పద్ధతులు గొలుసుల ద్వారా భూములు సర్వే చేస్తే ఎక్కువ సమయం పడుతుంది. అదేడీజీపీఎస్‌ విధానం ద్వారా గంటల్లో పూర్తి చేసే అవకాశముంది. అందుకే లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు డీజీపీఎస్‌ విధానంపై శిక్షణ ఇచ్చారు. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద రెండు గ్రామాల్లో రీసర్వే కూడా సాగుతోంది. శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లలో ఒక్కో గ్రామానికి నలుగురికి విధులు కేటాయించారు. మిగతావారు తమ విధులు, బాధ్యతల విషయంలో స్పష్టత రాక ఎదురుచూస్తున్నారు.

విధివిధానాలు ప్రకటించాలి

ప్రభుత్వం ఉపాధిపై భరోసా కల్పిస్తుందన్న ఉద్దేశంతో సర్వేయర్‌గా శిక్షణ పొందాను. స్వయంగా సీఎం చేతులమీదుగా లైసెన్స్‌ తీసుకున్నాను. ఎలాంటి వేతనం లేకుండా నాకు కేటాయించిన మండల కార్యాలయాలనికి వెళ్తున్నాను. ప్రభుత్వం నుంచి సరైన విధివిధానాలు రాక ఏమి చేయాలో తెలియడంలేదు.

– కొప్పుల రాకేశ్‌, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement