నిర్మల్‌చైన్‌గేట్: గ్రామపంచాయతీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నికలు ముగిసిన నెలరోజుల్లోనే కో–ఆప్షన్ ఎన్నిక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. కానీ, నూతన పాలకవర్గాలు కొలువుదీరి రెండునెలలైనా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆశావహులకు ఎదుచూపులు తప్పడంలేదు.
సర్పంచులకు శిక్షణ కూడా..
జిల్లాలో 2025 డిసెంబర్‌లో గ్రామపంచాయతీ ఎ న్నికలు మూడు దశల్లో నిర్వహించారు. అదేరోజు చాలా గ్రామాల్లో ఉపసర్పంచులను ఎన్నుకున్నారు. వివిధ కారణాలతో కొన్నిచోట్ల వాయిదా పడినా మ రుసటిరోజు నిర్వహించారు. కొత్త సర్పంచులకు ముధోల్ నియోజకవర్గంలోని బాసర ట్రిపుల్ ఐటీలో, నిర్మల్ నియోజకవర్గంలోని మహిళా ప్రాంగణంలో విడతలవారీగా శిక్షణ ఇస్తున్నారు. అయినా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మాత్రం చేపట్టలే దు.
పంచాయతీకి ముగ్గురు చొప్పున..
పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం ప్రతీ గ్రామపంచాయతీకి ముగ్గురు కో ఆప్షన్ సభ్యులుంటారు. పంచాయతీ పాలకవర్గం వీరిని ఎన్నుకుంటుంది. కోఆప్షన్ సభ్యులకూ వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. వీరు పాలకవర్గ సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా సలహాలు, సూచనలు చేయవచ్చు. ఉపసర్పంచుల అవిశ్వాస సమయాల్లో ఓటింగ్‌లో పాల్గొనే అవకాశముండదు. ముగ్గురిలో ఒకరు గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మరొకరు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి, ఇంకొకరు గ్రామాభివృద్ధికి సహకరించే దాత లేదా ఎస్‌ఆర్‌ఎస్‌ఐ ఉంటారు.
ఆశావహులకు తప్పని నిరీక్షణ
కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏ విధమైన సమాచారం లేదు. అసలు ఎన్నిక ఉంటుందా? లేదా? అ నే సందేహం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో వార్డుల్లో పోటీలో ఉన్న వారిని విరమింపజేయ డం, వివిధ పార్టీల మధ్య పొత్తుల్లో భాగంగా జరిగి న ఒప్పందాల్లో కో ఆప్షన్ పదవులు ఇస్తామని హా మీలిచ్చారు. అలాంటి హామీ పొందిన ఆశావహులు కో ఆప్షన్ పదవికోసం నిరీక్షించక తప్పడం లేదు.
ఆదేశాలు రాగానే ఎన్నిక
కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్నిక ప్రక్రియ చేపడతాం. కానీ, ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు రాాలేదు.
– శ్రీనివాస్, డీపీవో


