నెత్తుటి దారులు! | - | Sakshi
Sakshi News home page

నెత్తుటి దారులు!

Mar 16 2026 7:27 AM | Updated on Mar 16 2026 7:27 AM

● ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాలు ● మృత్యువాత పడుతున్న అమాయకులు ● గుంతలుపడ్డ రోడ్లే ప్రధాన కారణం ● నియంత్రణలో అధికారులు విఫలం ● సోన్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ సల్మాన్‌ జనవరి 5న ద్విచక్రవాహనంపై భైంసాకు వెళ్లి తిరిగి నిర్మల్‌కు వస్తుండగా తురాటి ఎక్స్‌ రోడ్‌ వద్ద మరో బైక్‌ వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సల్మాన్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ● ఫిబ్రవరి 9న భైంసా పట్టణానికి చెందిన లింకర్‌ సాయిరెడ్డి–గంగామణి దంపతులు ద్విచక్ర వా హనంపై నిర్మల్‌ వైపు వెళ్తుండగా నర్సాపూర్‌(జీ)మండలంలోని అర్లీ(కే) ఎక్స్‌రోడ్‌ ఎన్‌హెచ్‌–61 వద్ద ముధోల్‌కు చెందిన కూతడి దర్శన్‌ బైక్‌పై అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ● మంచిర్యాలలో సర్వే విభాగంలో డీఐగా విధులు నిర్వహిస్తున్న నసీరొద్దీన్‌ ఫిబ్రవరి 22న కడెం నుంచి జన్నారం వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో కోతులు అడ్డురాగా.. వాటిని తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ● భైంసా మండలం బిజ్జూర్‌ గ్రామానికి చెందిన కళ్యాణ్‌ కార్‌ శివాజీ ఫిబ్రవరి 25న భార్య అనూషాబాయితో కలిసి భైంసా పట్టణంలోని వివాహా నికి వెళ్లి, తిరిగి వెళ్లే క్రమంలో నిర్మల్‌ చౌరస్తా వద్ద లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివాజీ మృతి చెందాడు. ● ఈ నెల 8న ఆదివారం అర్ధరాత్రి నిర్మల్‌కు చెందిన మైల సృజన్‌, పురుషోత్తం పృథ్వీరాజ్‌ స్థానిక మంజులాపూర్‌లో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో గోల్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో ఎన్‌హెచ్‌–61 వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ సృజన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పురుషోత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ● ఈనెల 11న నిజామాబాద్‌ నుంచి భైంసాకు వె ళ్తున్న ఆర్టీసీ బస్సును బాసర రైల్వేస్టేషన్‌ సమీ పంలోని ఫ్లైఓవర్‌ వద్ద ఇసుక టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ● ఈనెల 12న ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం సోన్‌పల్లి గ్రామానికి చెందిన గణపతి చెల్లి కుమారుడి వివాహం ఆర్మూర్‌లో జరిగింది. ఈ పెళ్లికి సోన్‌పల్లి నుంచి ఐచర్‌ వాహనంలో 24 మంది బయల్దేరారు. నిర్మల్‌ రూరల్‌ మండలం కొండాపూర్‌ జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలి పల్టీ కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న వారంత ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, 22మంది గాయపడ్డారు.

నిర్మల్‌టౌన్‌: అన్ని రంగాల్లో చైతన్యం కలిగిన జిల్లాలో వరుసగా జరుగుతున్న ప్రమాదాల కారణంగా రోడ్లు నెత్తురోడుతున్నాయి. మారుమూల గ్రామాల్లోనే కాదు.. జిల్లా కేంద్రంలోని రోడ్లు కూడా వాహనదారులకు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాయి. 19 మండలాల్లో ప్రధాన మార్గాలు భారీ గుంతలతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. లారీలు, టి ప్పర్లు గ్రానైట్‌, కంకర, ఇసుక తరలిస్తూ రెట్టింపు లోడ్‌తో వెళ్తున్నాయి. రవాణాశాఖ నియమాల ప్రకా రం 10 టైర్ల వాహనాలు 20 టన్నులు, 16 టైర్ల వా హనాలు 40 టన్నుల వరకు మాత్రమే తీసుకెళ్లాలి. ఇంతకుమించిన లోడ్‌తో వాహనాలు వెళ్తుండగా రోడ్లు దెబ్బతింటూ ప్రమాదాలు పెరుగుతున్నాయి. అధికారులు నామమాత్రపు తనిఖీలతో చేతులు దులుపుకొంటున్నారు. ఆర్టీసీ బస్సులూ పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్నాయి. 36–54 సీట్ల బస్సుల్లో 70 మంది ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ సరిగా ఉన్నా బరువు ఎక్కువ కావడం ప్రమాదాలకు దారితీస్తోంది.

హైవేలపైనే తరచూ..

జిల్లాలో ప్రధానంగా రెండు హైవేలున్నాయి. ఒకటి మహారాష్ట్ర నుంచి నిర్మల్‌ మీదుగా జగిత్యాల వరకు 61వ నంబర్‌ జాతీయ రహదారి కాగా, రెండోది హైదరాబాద్‌ నుంచి జిల్లా మీదుగా నాగపూర్‌ వెళ్లే ఎన్‌హెచ్‌–44. జిల్లాకేంద్రం మీదుగా వెళ్లే ఈ రెండు రోడ్లే జిల్లా మొత్తం రవాణా వ్యవస్థకు, రాకపోకల కు ఆధారం. వీటిపైనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణాల్లోనూ లోపాలున్నాయ న్న వాదనలున్నాయి. నిర్మల్‌ నుంచి ఆదిలాబాద్‌ వై పు వెళ్లే ఎన్‌హెచ్‌–44 బైపాస్‌ రోడ్డుపై ఇప్పటివరకు పదులసంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. జిల్లా పొ డవునా ఉన్న ఎన్‌హెచ్‌–61పై తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. దేగాం, బైల్‌ తరోడ, జిల్లా కేంద్రం నుంచి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ వైపు వెళ్లే రోడ్లు, చిట్యాల బ్రిడ్జి, ఖానాపూర్‌ వైపు వెళ్లే మార్గంలో రోడ్లు సరిగాలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో అమాయకులు మృత్యువాత పడుతున్నారు.

ఇటీవల జరిగిన ప్రమాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement