డీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన వెడ్మ బొజ్జు పటేల్ మొట్టమొదటిసారిగా సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చా రు. ఈ సందర్భంగా స్థానిక ఐబీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శాలువా లు పూలమాలతో సత్కరించారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సారంగాపూర్ మాజీ జెడ్పీటీసీ పత్తి రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి, జిల్లా మైనారిటీ చైర్మన్ జూనెద్ మెమన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సమరసింహారెడ్డి, మైనారిటీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ.మతిన్, ఖిజార్ తదితరులు పాల్గొన్నారు.


