విద్యార్థులకు రవాణా భత్యం
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలకు సుదూర ప్రాంతాల నుంచి వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విద్యార్థులకు రవాణా భత్యం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, పీఎంశ్రీ పాఠశాలలకు వేర్వేరుగా నిధులను విడుదల చేసిందని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
అర్హులు వీరే....
జిల్లాలో 921 మందికి లబ్ధి..
ప్రభుత్వం విడుదల చేసిన రవాణా భత్యంతో జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే 921 విద్యార్థులకు మేలు చేకూరనుంది. ఈ విద్యార్థులకు ఒక్కో నెలకు రూ.600 చొప్పున నాలుగు నెలలకు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో సమగ్ర శిక్ష అభియాన్ పాఠశాలలకు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రవాణా భత్యం కింద రూ.22,10,400, పీఎంశ్రీ పాఠశాలలకు రూ.2,32,800 విడుదల చేసింది. మొత్తం రవాణా భత్యం కింద జిల్లాకు రూ.24,43,200 మంజూరయ్యాయి.


