అలుపెరుగని బాటసారులు
ఈ ఫొటోలో ఒంటెలతో ప్రయాణం సాగిస్తున్నవారంతా రాజస్థానీలు. సంచార తెగకు చెందిన వారు. వర్షాకాలం సీజన్ ముగింపు సమయంలో తమ గొర్రెల మందలను తోలుకుసి కాలి నడకన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు వస్తారు. గొర్రెలను మేపుతూ.. వాటిని విక్రయిస్తూ సాగిపోతుంటారు. పొద్దంతా నడక సాగిస్తూ.. చీకటి పడగానే అక్కడే గుడారాలు వేసుకుని ఉంటారు. మళ్లీ ఉదయం నడక సాగిస్తారు. అక్టోబర్‌లో జిల్లాకు వచ్చిన ఈ రాజస్థానీలు ఇప్పుడు మళ్లీ సొంత రాష్ట్రానికి బయల్దేరారు. చిన్న పిల్లలు, వృద్ధులు, సామగ్రిని ఒంటెలపై ఉంచి ఇలా నడక సాగిస్తున్నారు. – (ముధోల్)


