బాసరలో సినీ నటుడి పూజలు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని సినీ నటుడు టార్జాన్ లక్ష్మీనారాయణగుప్తా కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో వారి మనుమడికి అక్షరాభ్యాసం చేయించారు. పూజల అనంతరం వీరికి ఆలయ అర్చకుడు ప్రదీప్ మహారాజ్ అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. రామ్ గోపాల్‌వర్మ గాయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టినట్లు లక్ష్మీనారాయణగుప్తా తెలిపారు. తరువాత క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా వందల సినిమాల్లో నటించానన్నారు.


