స్థానాలు తారుమారు
న్యూస్‌రీల్
రొటేషన్ పద్ధతి అమలుతో తగ్గిన బీసీ స్థానాలు 2019 ఎన్నికల్లో 90.. ఇప్పుడు 72.. ఎస్సీలకు 63, ఎస్టీలకు 43 స్థానాలు రిజర్వ్ అన్ రిజర్వుడ్ 186 పంచాయతీలు
నిర్మల్
అక్రమాలకు చెక్
కవ్వాల్ టైగర్‌జోన్ గుండా వెళ్లే వాహనాలకు పర్యావరణ శిస్తు వసూలు విషయంలో అటవీశాఖ నూతన అధ్యయనానికి తెరతీసింది. చెక్‌పోస్టుల వద్ద ఫాస్టాగ్ ఏర్పాటు చేసింది.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఖానాపూర్ విద్యార్థులు
ఖానాపూర్: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇంటర్నేషనల్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ఖానాపూర్‌కు చెందిన విద్యార్థులు పాల్గొని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారని కరాటే మాస్టర్ మనోహర్ తెలిపారు. విద్యార్థులు 2 నిమిషాల్లో 100 కిక్‌లు పదిసార్లు చేయడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారన్నారు. మండలంలోని బీర్నంది జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన నాగచైతన్య, శివకుమార్, రేశ్వంత్, వాసు విద్యాలయానికి చెందిన అక్షర్, గోసంపల్లె బ్రిలియంట్ స్కూల్‌కు చెందిన ఉదయ్, ఖానా పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన చరణ్‌తేజ్, శాన్వి, యశస్‌చంద్ర, మస్కాపూర్ విజేత స్కూల్‌కు చెందిన రాజవర్ధన్, నిస్సీ స్కూల్‌కు చెందిన జగన్నాథ్ ఇందులో పాల్గొన్నారని వివరించారు. వీరికి తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో సర్టిఫికేట్లు, మెడల్స్ అందుతాయని అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్‌రెడ్డి తెలిపారు.
నిర్మల్‌చైన్‌గేట్: పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్ విధానం బీసీలను దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే బీసీ రిజర్వేషన్లు తగ్గిపోయాయి. ఆదివారం ఆర్డీవోల ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. మండల స్థాయిలో ఎంపీడీవోలంతా ఆయా వివరాలను ఆర్డీవోలకు అందించగా, ఆర్టీవోలు వాటిని ఫైనల్ చేసి కలెక్టర్‌కు పంపారు.
డెడికేటెడ్ కమిటీ నివేదిక ఆధారంగా..
బీసీ డెడికేటెడ్ కమిటీ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారు. అయితే రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాల్సి రావడంతో బీసీ స్థానాలు తారుమారయ్యాయి. 2019 నంవత్సరంలో బీసీలకు 90 సర్పంచ్ స్థానాలు రిజర్వు కాగా.. తాజాగా రిజర్వేషన్‌లో కేవలం 72 స్థానాలే దక్కాయి. 2019తో పోల్చుకుంటే 18 స్థానాలు తగ్గిపోయాయి. ఇక ఎస్సీలకు 63 స్థానాలు రిజర్వు కాగా, ఎస్టీలకు 43 స్థానాలు, అన్ రిజర్వుడులో 186 స్థానాలు ఉన్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సంగతి దేవుడెరుగు.. పాత రిజర్వేషన్ పద్దతిలో అమలు చేయడం, రొటేషన్‌లో రిజర్వేషన్ కల్పించడంతో బీసీ సీట్లకు కోత పడింది.
జిల్లాలో 400 పంచాయతీలు..
జిల్లాలో 400 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వాటిల్లో 186 పంచాయతీలను అన్ రిజర్వుడ్ ఉండగా.. మహిళకు 89, జనరల్‌కు 97 స్థానాలు కేటాయించారు. బీసీలకు 72 స్థానాలు రిజర్వు కాగా, అందులో మహిళలకు 31, జనరల్‌కు 41 స్థానాలను కేటాయించారు. ఎస్సీ కేటగిరీకి 63 స్థానాలను రిజర్వు చేయగా, అందులో మహిళలకు 27, జనరల్‌కు 36 స్థానాలు కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో 43 స్థానాలు రిజర్వు కాగా, అందులో మహిళలకు 22 జనరల్ 21 స్థానాలను రిజర్వు చేశారు.
వారి ఆశలపై నీళ్లు...!
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం పరిమితితో రిజర్వేషన్లు కేటాయించింది. కోర్టు కొట్టేయడంతో 50 శాతం పరిమితితో రిజర్వేషన్లు కేటాయించారు. అనుకూలంగా రిజర్వేషన్ రానివారు ఆందోళన చెందుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు పోటీకి సిద్ధమవుతున్నారు.
సమాఖ్యల్లో అభివృద్ధిపై చర్చ జరగాలి
సామాజిక వర్గాల వారీగా
రిజర్వేషన్ల వివరాలు
సామాజికవర్గం 2019 2025
ఎస్సీ 54 63
ఎస్టీ 36 43
ఎస్టీ(100 శాతం) 35 36
బీసీ 90 72
అన్ రిజర్వ్‌డ్ 181 186
మండలాల వారీగా సర్పంచుల రిజర్వేషన్లు
మండలం ఎస్టీ ఎస్టీ(మ) ఎస్సీ ఎస్సీ(మ) బీసీ బీసీ(మ) జనరల్ జనరల్(మ)
బాసర 0 0 1 1 1 2 2 3
భైంసా 0 1 3 3 4 4 7 8
దిలావర్‌పూర్ 1 0 1 1 1 1 3 3
దస్తురాబాద్ 1 0 1 2 0 1 3 3
కడెం 2 3 2 3 1 2 7 7
ఖానాపూర్ 1 2 2 2 2 2 6 6
కుభీర్ 4 5 3 3 2 3 10 11
కుంటాల 0 1 1 1 2 2 3 4
లక్ష్మణచాంద 1 0 1 2 2 2 4 5
లోకేశ్వరం 1 1 3 3 2 2 6 7
మామడ 2 3 1 2 1 2 6 6
ముధోల్ 1 0 1 2 2 3 4 5
నర్సాపూర్(జి) 1 0 1 1 1 2 3 3
నిర్మల్ 1 1 1 2 2 3 5 5
పెంబి 2 1 0 1 0 1 2 3
సోన్ 0 1 1 1 2 2 4 3
సారంగాపూర్ 3 2 2 3 2 3 7 8
తానూర్ 1 0 2 3 4 4 7 7
స్థానాలు తారుమారు


