అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణికి వచ్చిన అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వయంగా స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణి అనంతరం కార్మిక శాఖకు సంబంధించిన, కార్మికుల ప్రమాద బీమా పెంపు సమాచార గోడ ప్రతులను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఊరి మధ్యలో వైన్స్ వద్దు..
లక్ష్మణచాంద మండల కేంద్రంలో రెండు వైన్స్‌లు ఉన్నాయి. ఇవి పూర్తిగా జనావాసాల మధ్య ఉండడంతో ప్రజలు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి కొత్త వైన్స్‌లు ఊరి బయట ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. – లక్ష్మణచాంద, గ్రామస్తులు
నిషేధిత జాబితా నుంచి తొలగించాలి
నా తండ్రి సంటోల్ల ఎల్లప్ప పేరున సర్వే నంబర్ 20/అ 1,20/ఆ1లో చెరో 2.1600 గుంటలు భూమి కలదు. ఈ భూమి మాకు అనువంశికంగా వచ్చింది. ఇందులో నుంచి మా చిన్నమ్మ సంటోల్ల ఎల్లవ్వ ఎకరం భూమిని విక్రయించింది. అయితే తర్వాత ఆ భూమి మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో మాకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. జాబితా నుంచి తొలగించాలి. – సంటోల్ల సాయినాథ్, రాంటెక్
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఇందిరమ్మ ఇల్లు, అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలి. ప్రతీనెల ఒకటో తేదీన పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలి.
– బూర్గుల రాజు, భోజారెడ్డి
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నేను జిల్లా కేంద్రంలోని రాంనగర్, సోఫీనగర్ స్కూళ్లలో మన ఊరు మన బడి పనులు చేశాను ఇందుకోసం నాకు రూ.13,02,763 డబ్బులు రావాల్సి ఉంది. బిల్లు సకాలంలో రాక తీసుకువచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక అవస్థలు పడుతున్నాను. బిల్లులు మంజూరు చేయించండి.
– రామకృష్ణ, నిర్మల్
డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందించాలి..
ఖానాపూర్ పట్టణంలోని కుమురంభీం చౌరస్తాలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో నివాసముంటున్న అనర్హులను తొలగించి అర్హులైన నిరుపేదలకు అందించాలి. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
– డబుల్ బెడ్ రూమ్ సాధన సమితి సభ్యులు ఖానాపూర్
అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి
అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి
అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి
అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి
అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి


