● రుణాలు సద్వినియోగం చేసుకోవాలి.. ● మహిళలు ఆర్థికంగా ఎద
భైంసాటౌన్: మహిళా సమాఖ్య సమావేశాల్లో ఆర్థికాభివృద్ధి, కుటుంబాల అభివృద్ధి, మెరుగైన విద్య, వైద్యం తదితర అభివృద్ధి అంశాలపై చర్చ జరగాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన మహిళల ఉన్నతి–తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించి అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. శుభకార్యాల పేరిట అనవసర ఆర్భాటాలకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితి మారాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు ఎన్నికల హామీ నెలకు రూ.2500 అమలు చేయాలని కోరుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆటోనగర్ నుంచి కుభీర్ చౌరస్తా వరకు రూ.2 కోట్లతో నిర్మించే బైపాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్, డీఆర్డీవో విజయలక్ష్మి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నారాయణ్‌రావు పటేల్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


