సాంకేతిక రంగాల్లో రాణించాలి
సోన్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో సైన్స్ ల్యాబ్‌ను సోమవారం ప్రారంభించారు. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్‌ను సద్వినియోగం చేసుకుని భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్, డీసీసీ చీఫ్ వెడ్మ బొజ్జు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, డీఈవో భోజన్న, గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ, ఏఎస్పీ రాజేశ్‌మీనా, ప్రిన్సిపాల్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.


