కార్మిక వ్యతిరేక విధానాలపై రేపు నిరసన
ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఈనెల 26న దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ తెలిపారు. పట్టణంలోని వాటర్‌ట్యాంక్ వద్ద నిరసన కార్యక్రమ కరపత్రాలు సోమవారం ఆవిష్కరించారు. కార్మికులు, రైతులు, ప్రజలకు నష్టం చేసే విధానాలను ఎండగట్టాలన్నారు. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాసిందన్నారు. బుధవారం నిర్మల్‌లోని మినీ ట్యాంక్ బండ్ నుంచి గాంధీపార్క్ వరకు ర్యాలీ, రాస్తారోకో కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్, నాయకులు తిరుపతి, శ్రీనివాస్, నారాయణ, భూమన్న తదితరులు పాల్గొన్నారు.


