నిర్మల్
1990 దశకంలో రేడియో, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, టేప్ రికార్డర్లతో కూడిన ఆహ్లాదకరమైన సాయంత్రాలు ప్రతీ ఇంటిని ఆనందంతో నింపాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు వినోదాన్ని వ్యక్తిగతం చేశాయి. అయితే ఈ స్మార్ట్ కాలంలోనూ జిల్లాకు చెందిన కొందరు ఈ పాత అలవాట్లను, సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రేడియోలో పల్లె సీమ, జానపద గీతాలు, టేప్ రికార్డర్‌లోపాటలు, సంప్రదాయ వేషధారణలతో వారు గత కాలపు మధుర స్మృతులను సజీవంగా ఉంచుతున్నారు. – నిర్మల్‌ఖిల్లా
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025
అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి
నిర్మల్‌చైన్‌గేట్:తరతరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలను ఆ భూముల నుంచి వెళ్లగొట్టకుండా భూములకు హక్కు పత్రాలు అందించాలని సీసీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.రాజు డిమాండ్ చేశారు. సీసీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అల్లంపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి, ఏవోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తరతరాలుగా ఆదివాసులు, గిరిజనులు, ఇతర పేదలు అడవుల్లో జీవిస్తూ అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. 2006 అటవీ హక్కుల చట్టం వచ్చి, భూములు సర్వే జరిగినా, ఇప్పటికీ హక్కు పత్రాలు అందలేదన్నారు. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని పేర్కొన్నారు. రుణాలు, రుణమాఫీలు, బ్యాంకు లోన్లు, లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు ఖానాపూర్, కడెం మండలాల పరిధిలోని పేదలను బెదిరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కె.సర్దార్, ఎం.హరిత, అల్లంపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్


