భరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
భైంసాటౌన్: క్షణికావేశం, వివిధ కారణాలతో విడిపోయిన జంటలకు కౌన్సెలింగ్ కో సం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని స ద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ జానకీ ష ర్మిల సూచించారు. బుధవారం పట్టణంలో ని తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశా రు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ బుధవారం భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజా వాణిలో స్వీకరించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ, ఎప్పటికప్పుడు ఫిర్యా దు స్థితి తెలుసుకుంటున్నట్లు ఆమె చెప్పా రు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చే రువ చేసేలా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఏఎస్పీ అవినాష్‌కుమార్, సీఐలు గోపీనాథ్, నైలు, మల్లేశ్, కేంద్రం సిబ్బంది జ్యోతి, శిరీష, క్యాంప్ ఇన్‌చార్జి రఘువీర్ ఉన్నారు.
వైద్యారోగ్యశాఖలో బయోమెట్రిక్
నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో గురువారం నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయనున్నట్లు డీఎంహెచ్‌వో రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలోనే అన్ని ఆరోగ్య కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా హాజరును ప ర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. కాగా, సాంకేతిక ఇబ్బందులతో బయోమెట్రిక్ యంత్రం రిపేర్‌లో ఉన్నట్లు తెలిపారు. వాటిని మరమ్మతు చేయించి, అవసరమైన చోట కొత్త వాటిని బిగించి బయోమెట్రిక్ హాజరును అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


