రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్ రూరల్: ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంతోపాటు, మండలంలోని రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో గ్రామస్తులకు మంగళవారం అవగాహన కల్పించారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, ఫస్ట్ ఎయిడ్ వినియోగం, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు గౌరవించి తమ భద్రతతోపాటు ఇతరుల భద్రతకూ సహకరించాలన్నారు. ఇందులో ఏఎస్పీ సాయికిరణ్, సీఐలు నైలు, కృష్ణ, సర్పంచ్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.


