బ్యాలెట్‌తోనే మున్సి‘పోల్స్’!
2014లో ఈవీఎంలతోనే ఎన్నికలు 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పేపర్ల వినియోగం.. ఈసారి మళ్లీ బ్యాలెట్ పేపర్‌వైపే ప్రభుత్వం మొగ్గు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశం
నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. తుది ఓటరు జాబితా విడుదల కావడంతో రిజర్వేషన్లపై కసరత్తు జరుగుతోంది. ఇక మరోవైపు ఎన్నికలు బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే 3 మున్సిపాలిటీల పరిధిలో బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు, మున్సిపల్ ఆఫీసర్లు బ్యాలెట్ పేపర్ కోసం పేపర్ కంపెనీలకు ముందస్తు ఆర్డర్లు పంపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు.. ముద్రించి అందించేలా పేపర్‌ను రెడీ చేసి పెట్టుకోవాలని ఆదేశించారు. 2014లో మున్సిపల్ ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించింది. తర్వాత 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరిగాయి. ఈసారి ఈవీఎంలతో నిర్వహించే వెసులుబాటు ఉన్నా ప్రభుత్వం బ్యాలెట్ వైపే మొగ్గు చూపింది.
490 బ్యాలెట్ బాక్సులు..
జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో సుమారు 490 బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మూడు మున్సిపాలిటీల్లో 80 వార్డులలో 217 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు రెండు బ్యాలెట్ బాక్సుల చొప్పున 434 అవసరం కాగా అదనంగా 50 బాక్సులను అందుబాటులో ఉంచనున్నారు. అధికార యంత్రాంగం బాలెట్ బాక్సులను పరిశీలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వాడుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
చిక్కులు తప్పవు..
ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లలో చెల్లని ఓట్ల ప్రస్తావన ఉండదు. కానీ బ్యాలెట్ పేపర్‌లో ఓటు ముద్ర సరిగా పడకపోవడం కొంత చిక్కులకు దారి తీస్తుంది. అదే రీతిలో బ్యాలెట్ పేపర్‌ను మడతపెట్టే క్రమంలో రెండు వైపులా పడటం మరో సమస్యగా మారనుంది. నిరక్షరాస్యులు ఓటు వేయడంలో గందరగోళానికి గురై బ్యాలెట్‌పై ఏదో ఓ చోట ఓటు ముద్ర వేయడం అభ్యర్థుల తలరాత మారుతోంది. గతంలో కౌంటింగ్ సందర్భంగా చెల్లని ఓట్ల విషయంలో వివాదాలు తలెత్తాయి.
మున్సిపాలిటీ వార్డులు పోలింగ్ బ్యాలెట్
స్టేషన్లు బాక్సులు
నిర్మల్ 42 127 280
భైంసా 26 66 150
ఖానాపూర్ 12 24 60


