జామ్‌లో కోతులు పట్టివేత
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామంలో కోతుల బెడద కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సర్పంచ్ కరిపె రవళి మంగళవారం కోతులను పట్టించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా కోతులను పట్టేవారిని తమిళనాడు నుంచి రప్పించి మూడు బృందాలుగా వారిని విభజించి కోతులను పట్టించారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు దాదాపు 80కి పైగా కోతులను పట్టుకున్నామని కోతులను పట్టుకునేందుకు వచ్చినవారు తెలిపారు. మరో వారంరోజుల్లో గ్రామంలో ఉన్న కోతులన్నింటినీ బంధించి కోతుల పునరవాసకేంద్రానికి తరలిస్తామని సర్పంచ్ తెలిపారు.


