కొత్త ల్యాబ్ టెక్నీషియన్లొస్తున్నారు..
జిల్లాలో 35 మందికి పోస్టింగ్ నియామకపత్రాలు అందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎంఈ, టీవీవీపీ, పీహెచ్‌సీలకు కేటాయింపులు
నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ) 2024 నవంబర్ 10న రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్లకు రాత పరీక్ష నిర్వహించింది. ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారి సర్టిఫికెట్ల పరిశీలన చేసి, గతేడాది నవంబర్ 17న తుది జాబితా వెలువరించింది. జిల్లా నుంచి ఎంపికై న 35 మంది నూతన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అభ్యర్థులకు మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉస్మానియా మెడికల్ కళాశాల మైదానంలో నియామక పత్రాలు అందజేశారు.
పోస్టుల భర్తీ ఇలా..
జిల్లాలో ఖాళీగా ఉన్న 35 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషి యన్ పోస్టులను భర్తీ చేశారు. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ బోర్డు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ , వైద్య వి ధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద వీరిని నియమించింది. నిర్మల్ ప్రభు త్వ మెడికల్ కళాశాలకు అనుబంధ జనరల్ ఆస్పత్రికి 23, వైద్య విధాన పరిషత్‌కు 5, వైద్యారోగ్యశాఖ పీహెచ్‌సీలకు ఏడుగురిని కేటాయించారు.
ప్రజారోగ్య సేవలకు మరింత బలం...
జిల్లాకు కొత్తగా 35 మంది ల్యాబ్ టెక్నీషియన్లు రానుండడంతో వైద్య సేవలు పెరగనున్నాయి. నూతన నియామకాలతో ప్రతీ పీహెచ్‌సీకి ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను కేటాయించనున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వాస్పత్రులకు వచ్చేవారికి రక్త పరీక్షలు, రిపోర్టుల కోసం ఎదురుచూపులు తప్పనున్నాయి.


