రాజన్న స్వప్నం.. సాకారం
వైఎస్సార్ హయంలోనే
సదర్మాట్‌కు తొలి అడుగు
ఎట్టకేలకు బ్యారేజీ నిర్మాణం పూర్తి
ఖానాపూర్: ఖానాపూర్, కడెం మండలాల రైతుల దశాబ్దాల కల సదర్మాట్ బ్యారేజీ. జలయజ్ఞ ప్రదా త, అపర భగీరథుడిగా తెలుగు ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. వెస్సార్ కల ఎట్టకేలకు సాకా రం అయింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు దిగువన ఉన్న సదర్మాట్ ఆనకట్టను 125 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ ఇంజినీర్ జేజే.ఒటాలే మేడంపల్లి శివారులో గోదావరి నదిపై నిర్మించారు. దీని కాలువ ద్వారా 28 గ్రామాల్లో 25 వేల ఎకరాలకు నీరందుతోంది. నిల్వ సామర్థ్యం లేక వర్షాకాలంలో నీరు వృథాగా పోయేది. ఖరీఫ్‌కు మాత్రమే సాగునీరు అందేది. బ్యారేజీ నిర్మాణంతో రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం ఏర్పడింది. అయితే బ్యారేజీ కోసం దశాబ్దాలుగా రైతులు, ఆందోళన చేశారు.
హామీ నిలబెట్టుకున్న వైఎస్సార్..
2008–09 పల్లెబాటలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఖానాపూర్‌ను సందర్శించారు. రైతుల విన్నపాలు స్వీకరించారు. రైతులు సదర్మాట్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వైఎస్సార్ ఆరోజు మాజీ ఏపీపీఎస్సీ సభ్యుడు రవీందర్‌రావు నివాసంలో బస చేశారు. మరుసటిరోజు సదర్మాట్ ఆనకట్టను సందర్శించారు. బ్యారేజీ నిర్మిస్తే రెండు పంటలకు నీరందుతుందని రైతులు తెలిపారు. దీంతో బ్యారేజీ నిర్మాణానికి వైఎస్సార్ సర్వే చేసి ప్రతిపాదనలు పంపాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు బ్యారేజీ నిర్మాణానికి రూ.305 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ మేరకు 2009 జనవరి 27న ఖానాపూర్‌కు వచ్చిన వైఎస్సార్ రూ.305 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన అకాల మరణంతో ఆర్థికశాఖ క్లియరెన్స్ లేక టెండర్లు నిర్వహించలేదు.
వైఎస్సార్ పేరు పెట్టాలి...
సదర్మాట్ బ్యారేజీ నిర్మాణానికి మూలకారకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వైఎస్సార్ చొరవతోనే నాడు బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసింది. బ్యారేజీకి వైఎస్సార్ పేరు పెట్టాలి. – సాగి లక్ష్మణ్‌రావు,
మార్కెట్ కమిటీ మాజి చైర్మన్, ఖానాపూర్
సదర్మాట్ ఆనకట్టను పరిశీలిస్తున్న వైఎస్సార్(ఫైల్)
పొన్కల్ వద్ద నిర్మాణం...
తర్వాత సదర్మాట్ బ్యారేజీ పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు వలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలు మార్చి పనులు చేపట్టారు. అయితే బ్యారేజీని మేడంపల్లిలో కాకుండా ఎగువన 7 కిలోమీటర్ల దూరంలోని మామడ మండలం పొన్కల్ సమీపంలో నిర్మించారు. గతంలో సదర్మాట్ ద్వారా ఖానాపూర్, కడెం మండలాలకు కాలువ ద్వారా నీరందేది. బ్యారేజీ నిర్మాణంతో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గంగనాల ప్రాజెక్టు ద్వారా ఆయా గ్రామాల్లోని మరో 5 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. మామడ మండలంలోని గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుంది. భూగర్భజలాలూ పెరగనున్నాయి. కడెం ప్రాజెక్టు ఫీడింగ్ సైతం పెరగడంతో జన్నారం మీదుగా లక్సెట్టిపేట వరకు సాగు నీరందే అవకాశముందని అధికారులు తెలిపారు.
రాజశేఖరరెడ్డి పేరుపెట్టాలని
రైతుల డిమాండ్
సదర్మాట్ బ్యారేజీ
రాజన్న స్వప్నం.. సాకారం
రాజన్న స్వప్నం.. సాకారం


