క్యాలెండర్ ఆవిష్కరణ
నిర్మల్‌టౌన్: నిర్మల్ జిల్లా కోర్టు ఆవరణంలో న్యాయవాద పరిషత్ రూపొందించిన 2026 సంవత్సరం క్యాలెండర్‌ను న్యాయవాదులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేర్ నరేందర్ మాట్లాడుతూ.. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి న్యాయవాద పరిషత్ పనిచేస్తుందన్నారు. అలాగే నిరుపేదలకు న్యాయ సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోవర్ధన్, అశోక్, శ్యాం సుందర్‌రెడ్డి, వీవీ.రమణారావు, కోమ్మోజి రమణ, మధుకర్, వంశీకృష్ణ, రాజేశ్వరరత్నం తదితరులు పాల్గొన్నారు.


