యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం పూర్తిచేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణం త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్లను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ది వ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్‌కుమార్, సీఎస్ రామకష్ణారావుతో కలిసి వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలవారీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీలో ముందు వరుసలో ఉంచేలా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతుందన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఈ నిర్మాణాలపై సమీక్షిస్తూ ఉండాలన్నారు. ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో నిర్మాణ ప్రదేశాలకు వెళ్లి పర్యవేక్షించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి..
వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఫొటో ఎలక్టరోల్స్ జాబితా, డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలు, తదితర అంశాల వివరాలను సీఎస్‌కు జిల్లాల వారీగా కలెక్టర్లు వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. తగినంత మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారో లేరో పరిశీలన చేసుకోవాలన్నారు. సామగ్రి సమకూర్చుకోవాలన్నారు. ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఈవో భోజన్న, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, సుందర్‌సింగ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


