ఉపాధి కల్పించాలి
నాకు ఇద్దరు కూమారులు. నా భర్త జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పపత్రిలో అటెండర్ గా పనిచేసేవాడు. అక్టోబర్ 29న విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా అక్కపూర్ గ్రామ రొడ్డు పైన గల ’సోయబీన్ కుప్పను ఢీకొని మరణించాడు. మా కుటుంబము దీన పరిస్థితిలోకి వెళ్లిది. గ్రామంలో ఆశ వర్కర్ పోస్టు ఖాళీగా ఉంది. నాకు ఇప్పించి ఆదుకోగలరు. – ద్యావతి హారిక, న్యూ వెల్మల్
విద్యుత్ స్తంభాలు తొలగించాలి
నాకు సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామంలో సర్వే నంబర్ 563/7/5 లో వ్యవసాయ భూమి ఉంది. నా వ్యవసాయ భూమిలో రెండు విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. వీటి కారణంగా నేను వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాను. అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలు తొలగించాలి.
– బొడ్డు నరేశ్, చించోలి(బి)
ఉపాధి కల్పించాలి


