నిర్మల్
న్యూస్‌రీల్
ఆదివాసీల ఆత్మబంధువు..
ఆదివాసీల ఆత్మబంధువు హైమాన్‌డార్ఫ్ అని ఎంపీ గోడం నగేశ్ కొనియాడారు. జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో డార్ఫ్ దంపతుల వర్ధంతిని నిర్వహించారు.
గజ్జలమ్మదేవికి పూజలు
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు శ్రీకాంత్ రామానుజదా స్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, హారతి, పల్లకీసేవ నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.
తానూరు: జిల్లాలో పలువురు రైతులు ఉద్యాన పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దిగుబడి, రాబడి లాభసాటిగా ఉండడం, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుండడంతో క్రమంగా జిల్లాలో సాగువిస్తీర్ణం పెరుగుతోంది. ఏటా రైతులు వివిధ పంటలు సాగు చేసి ఏదో రకంగా నష్టపోతూ ఉన్నారు. దిగుబడులు రాక అప్పులపాలవుతున్నారు. దీంతో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం, ఉద్యానవనశాఖ ముందుకువచ్చింది. ఉద్యానవనశాఖ అధికారులు మల్చింగ్ ద్వారా పంటలు సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మల్చింగ్ పద్ధతి ద్వారా పంటలు సాగు చేసిన రైతులకు ఉద్యానవనశాఖ 50 శాతం సబ్సిడీ ఇస్తోంది. మల్చింగ్ విధానంలో పంటలు సాగుచేస్తే పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గి దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి.
మల్చింగ్ సాగు ప్రయోజనాలివే..
రైతులు మల్చింగ్ పద్ధతిలో పంటలు సాగు చేస్తే అ నేక ప్రయోజనాలున్నాయి. పంటలో కలుపు మొక్కలు పెరగవు. భూమిలోని తేమను మొక్కలకు అంది స్తుంది. మొక్కలు బలంగా నాటుకోవడానికి మ ల్చింగ్ షీట్‌లు ఎంతో ఉపకరిస్తాయి. మల్చింగ్ షీట్‌లను రైతులు వినియోగించుకోవడానికి ఆసక్తి చూ పుతుండడంతో ఈ షీట్‌లకు డిమండ్ బాగానే ఉంది. ఉద్యానవన శాఖ అధికారులు కూడా మల్చింగ్ షీట్‌లను విరివిగా అందించడానికి కృషిచేస్తున్నారు. ఈ ఏడాది కూడా మల్చింగ్ విధానంలో సాగు చేసే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
ఖర్చు తక్కువ.. దిగుబడి ఎక్కువ
జిల్లాలో గతేడాది 180మంది రైతులు మల్చింగ్ విధానంలో పండ్లతోటలు, కూరగాయలు, పుచ్చ సాగుచేస్తున్నారు. ఈ పద్ధతిలో సాగుచేసిన పంటలకు నీటి అవసరం చాలా తక్కువ. దీంతో పాటు కూలీల ఖర్చు కూడా మిగతా పంటలకంటే తక్కు వే. పంటలు సాగుచేసిన రైతులకు పెట్టుబడి తగ్గి దిగుబడి అధికంగా వస్తోంది. ఎకరాకు రూ.25వేలు ఖర్చుచేస్తే ఖర్చులు పోను రూ.70 వేలు మిగులుతున్నట్లు రైతులు చెబుతున్నారు. మల్చింగ్ పద్ధతి ద్వారా పండించిన కూరగాయలు, పుచ్చకాయలు ఇతర రాష్ట్రాలకూ సరఫరా చేస్తున్నారు. జిల్లాలో భైంసా డివిజన్‌లో ఎక్కువమంది రైతులు మల్చింగ్ విధానంలో పంటలు సాగుచేస్తున్నారు.
నిర్మల్
నిర్మల్
నిర్మల్
నిర్మల్


