పిల్లల్లో దేశభక్తిని పెంచాలి
భైంసాటౌన్: తల్లిదండ్రులు పిల్లల్లో దేశభక్తిని పెంచాలని విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని కి సాన్‌గల్లి శ్రీసరస్వతి శిశుమందిర్‌లో ఆదివారం పూర్వవిద్యార్థుల మహా సమ్మేళనం నిర్వహించారు. 1696–2020 బ్యాచ్‌ల విద్యార్థులు పాల్గొన్నారు. కా ర్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. సరస్వతి శిశుమందిరాల్లో విద్యార్థులకు చదువుతోపాటు క్ర మశిక్షణ, సదాచారం, దేశభక్తి భావం పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. శిశు మందిరాలు లాభాపేక్ష లేకుండా పని చేస్తున్నాయని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సరస్వతి విద్యాపీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, పూర్వ విద్యార్థి, దక్షిణమధ్య క్షేత్ర ప్రశిక్షణ్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ, ఐఆర్‌ఎస్ అధి కారి వడ్నప్ నిఖిల్, పూర్వ విద్యార్థి పరిషత్ సభ్యులు, పూర్వ ఆచార్యులు పాల్గొన్నారు.


