పంట ఆశాజనకంగా ఉంది
ఉద్యానవనశాఖ ప్రోత్సాహంతో ఎకరంలో జామ సాగు చేసిన. 50శాతం సబ్సిడీ ఇచ్చి సహకరిస్తోంది. పంట దిగుబడి కూడా బాగుంది. దీంతో పెట్టుబడి పోను ప్రతీ పంటపై లాభం వస్తోంది. రైతులకు ఉద్యానవనశాఖ ద్వారా అందిస్తున్న ప్రోత్సాహం బాగుంది.
– బద్రె సాయినాథ్, రైతు, తానూరు
రైతులను ప్రోత్సహిస్తున్నాం
ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు ఎంతో ప్రోత్సాహం అందుతోంది. మల్చింగ్ షీట్‌ల ద్వారా ఉద్యానవన పంటలకు మేలు జరుగుతోంది. పండ్ల మొక్కలు పెంచడంతో రైతులు ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ఉద్యానవనశాఖ స్కీంలను రైతులకు వివరిస్తున్నాం. ఈ ఏడాది రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. – జావిద్ పాషా,
ఉద్యానవనశాఖ డివిజన్ అధికారి


