ఘనంగా వివేకానంద జయంతి
భైంసారూరల్: స్వామి వివేకానంద ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్ అన్నారు. మండలంలోని కామోల్, ఇలేగాం, మహాగాం, వానల్‌పాడ్, సుంక్లితోపాటు పలు గ్రామాల్లో స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. వివేకానందుని విగ్రహానికి, చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువకులు, విద్యార్థులు స్వామి వివేకానంద చూపిన బాటలో పయనించాలన్నారు. సమాజ సేవపై యువతరం దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ చింత చిన్న య్య, డా.దామోదర్‌రెడ్డి, రామకృష్ణాగౌడ్, నగేశ్, ఆయా గ్రామాల సర్పంచులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


