కల్యాణం.. కమనీయం
నిర్మల్‌టౌన్/ఖానాపూర్: జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో, ఖానాపూర్ వేంకటేశ్వరాలయంలో గోదాదేవి రంగనాథ కల్యాణం సోమవారం కనుల పండువగా నిర్వహించారు. వేద పండితులు ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం జరిపించారు. స్వామికి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి, నిత్య పూజలు అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. ఇందులో ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
కల్యాణం.. కమనీయం


